Railways Project : వారణాసికి రూ.2,642 కోట్లతో మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ (మొఘల్ సరాయ్) వరకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి మంజూరు చేసింది.

Update: 2024-10-16 16:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ (మొఘల్ సరాయ్) వరకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి మంజూరు చేసింది. దాదాపు రూ.2,642 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీని నిర్మాణం వల్ల మనదేశ రైల్వే నెట్‌వర్క్ మరో 30 కి.మీ మేర విస్తరిస్తుందని కేంద్రం ప్రకటించింది.

ఇందులో భాగంగా గంగానది మీదుగా వారణాసి, ఛందౌలీ జిల్లాల పరిధిలో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధన్యవాదాలు తెలిపారు. పర్యాటక, వాణిజ్య రంగాల్లో వారణాసి ప్రాధాన్యతను మరింత పెంచేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. 


Similar News