Waqf Bill : 2025 ఫిబ్రవరిలో పార్లమెంటు ఎదుటకు ‘వక్ఫ్’ బిల్లు ?

దిశ, నేషనల్ బ్యూరో : వివాదాస్పద ‘వక్ఫ్ సవరణ బిల్లు’(Waqf Bill)ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల(Budget Session) సందర్భంగా పార్లమెంటు(Parliament)లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Update: 2024-11-27 18:05 GMT
Waqf Bill : 2025 ఫిబ్రవరిలో పార్లమెంటు ఎదుటకు ‘వక్ఫ్’ బిల్లు ?
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : వివాదాస్పద ‘వక్ఫ్ సవరణ బిల్లు’(Waqf Bill)ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల(Budget Session) సందర్భంగా పార్లమెంటు(Parliament)లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ‘వక్ఫ్’ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) బుధవారం సమావేశమైంది. జేపీసీ గడువును పొడిగించాలని కోరుతూ ఈసందర్భంగా జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

వచ్చే సంవత్సరం జరగనున్న కేంద్ర బడ్జెట్ సమావేశాల మొదటి వారంలో ‘వక్ఫ్’ బిల్లుపై నివేదికను పార్లమెంటుకు సమర్పించేందుకు జేపీసీకి అవకాశమివ్వాలని ఆయన ప్రతిపాదించారు. ఈ మేరకు తీర్మానం చేసిన ప్రతులను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు పంపారు. ఈ ప్రతిపాదనకు స్పీకర్ అనుమతి లభించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. వక్ఫ్ భూములు అత్యధికంగా ఉండే చాలా రాష్ట్రాలను జేపీసీ ఇంకా సందర్శించలేదని విపక్ష పార్టీలు వాదిస్తున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Tags:    

Similar News