ప్రాణభయం ముందు ఇదెంతా..! ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం మీద నుంచి దూకిన విద్యార్థులు
లేడీస్ హాస్టల్ లో ఏసీ పేలడంతో విద్యార్థులు భవనంపై నుంచి దూకిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: లేడీస్ హాస్టల్ లో ఏసీ పేలడంతో విద్యార్థులు భవనంపై నుంచి దూకిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో జరిగింది. మనుషులు ప్రాణభయంతో ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడరు అనేది సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియోను చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. వీడియో ప్రకారం గ్రేటర్ నోయిడా (Greater Noida)లోని అన్నపూర్ణ హాస్టల్ (Annapurna Hostel) లో ఏసీ పేలడంతో (AC Explored) ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించడం ప్రారంభించాయి.
ప్రమాద సమయంలో హాస్టల్ లో మొత్తం 160 మంది విద్యార్థులు (Students) ఉన్నారు. భయంతో వారంతా కిందికి పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భవనంలో చిక్కుకున్న కొందరు విద్యార్థులు ప్రాణ భయంతో ఏకంగా భవనం కిటికీల (Building Windows) నుంచి దూకడం (Jumping) ప్రారంభించారు. అంత ఎత్తు నుంచి కింద పడితే గాయాలు అవుతాయన్న భయం కన్నా వారిలో ప్రాణభయమే ఎక్కువ కనిపించింది. భవనంలోని రెండో అంతస్థు నుంచి దూకుతున్న సమయంలో కొందరు విద్యార్థులకు గాయాలు (Injured) కూడా అయ్యాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. దీనికి సంబంధించి వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.