Live-In Partner: లివ్ ఇన్ పార్ట్‌నర్ దారుణ హత్య.. 50 ముక్కలుగా నరికిన ప్రియుడు !
జార్ఖండ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన లివ్ ఇన్ పార్ట్ నర్‌ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి (24) అనే యువతితో రెండేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే బెంగ్రా గంగికి తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే ఈ నెల 24న యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే పారేశాడు. బాలిక శరీరంలోని భాగాన్ని కుక్క తినడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. మరికొన్ని శరీర భాగాలను స్థానికంగా కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనే నిందితుడు నరేశ్ బెంగ్రాను అరెస్టు చేశారు.