మోడీ సర్కారు ఐదేళ్లు నిలవడం కష్టమే : మమతా బెనర్జీ

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కామెంట్ చేశారు.

Update: 2024-07-12 19:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కామెంట్ చేశారు. కేంద్ర సర్కారులోని అస్థిరత స్పష్టంగా కనిపిస్తోందని, అసలు ఆట ఇప్పుడే మొదలైందని ఆమె పేర్కొన్నారు. అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ శుక్రవారం ముంబైకి చేరుకున్నారు. ఈసందర్భంగా ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ , శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రేలతో వేర్వేరుగా దీదీ భేటీ అయ్యారు. ఈసమావేశాల అనంతరం మమతాబెనర్జీ మీడియాతో మాట్లాడారు.

‘‘ఎమర్జెన్సీకి మేం వ్యతిరేకం. ప్రధాని మోడీ హయాంలోనే ఎమర్జెన్సీ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చేటప్పుడు మోడీ సర్కారు ఎవరినీ సంప్రదించలేదు. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో ఆ చట్టాలను ఏకపక్షంగా ఆమోదించారు’’ అని దీదీ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున ప్రచారం చేస్తానని ఆమె ప్రకటించారు.


Similar News