Drug racket: భారీ డ్రగ్స్ రాకెట్ చేధించిన పంజాబ్ పోలీసులు.. 105 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం
పంజాబ్ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను చేధించారు. 105 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ పోలీసులు (Punjab Police) భారీ డ్రగ్స్ రాకెట్(drug racket) ను చేధించారు. ఇంటలిజెన్స్(intelligence) సమాచారం మేరకు అమృత్‌సర్ (Amritsar) లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 105 కిలోల హెరాయిన్ (heroin), 31.93 కిలోల కెఫిన్ (Caffeine), 17 కిలోల డీఎంఆర్, 5 విదేశీ పిస్టల్స్ (foreign-made pistols) ,ఒక దేశీయ పిస్టల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అమృత్‌సర్‌కు చెందిన నవజ్యోత్ సింగ్(navajyoth singh), కపుర్తలాకు చెందిన లవ్‌ప్రీత్ కుమార్(love preeth kumar)గా గుర్తించారు. నిందితుల నాయకుడు నవప్రీత్ సింగ్ అలియాస్ భుల్లర్ విదేశాల నుంచి డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. తాజాగా అరెస్ట్ చేసిన నిందితులు భుల్లర్‌కు సహచరులుగా ఉన్నారని తెలిపారు. సీజ్ చేసిన సామగ్రి అంతా పాకిస్థాన్(pakisthan) నుంచి వచ్చాయని డీజీపీ గౌరవ్ యాదవ్ (Gowrav yadav) తెలిపారు. రికవరీ చేసిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్ (international market) లో రూ.500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. పాక్ నుంచి డ్రగ్స్ రవాణా చేయడానికి జల మార్గాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది.