'ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు'.. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోడీ సూచన

వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి ముందుకు సాగుతోంది.

Update: 2023-08-03 15:01 GMT

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న కాషాయ పార్టీ.. తమ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలకూ విజయ రహస్యాలను చెబుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్డీయే ఎంపీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 48 మంది ఎన్డీయే ఎంపీలతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా ప్రసంగాల్లో నోరు జారొద్దని సూచించారు.

ప్రజలతో మమేకం కావాలని, పేదల కోసం పనిచేయాలని చెప్పారు. అలాగే, విపక్షాల ఉచిత హామీలతో భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దక్షిణాదిలో మెరుగైన సీట్లు సాధించేలా కృషి చేయాలని ప్రధాని మోడీ నిర్దేశించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలని ఎంపీలకు సూచించారు.


Similar News