Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. కేబినెట్ ప్రతిపాదనకు ఎల్జీ ఆమోదం

జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ ఒమర్ కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపారు.

Update: 2024-10-19 12:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా శనివారం ఆమోదం తెలిపారు. ఈ అంశాన్ని త్వరలోనే ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సురీందర్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. కేంద్రం తన హామీని నెరవేర్చాలని, రాష్ట్ర హోదాను పునరుద్ధరణ అనేది కశ్మీరీల హక్కు అని తెలిపారు. అలాగే ఇదే విషయమై చర్చించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రతిపాదనకు తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదం లభిస్తుందని ఒమర్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజే తీర్మానాన్ని తీసుకురాగా దీనికి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కాగా, 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ను తొలగించడంతో పాటు, కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. 


Similar News