Viral Video:మొబైల్ చూస్తూ ట్రైన్ పట్టాలెక్కిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.

Update: 2024-10-19 13:56 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఎవరి చేతిలో చూసిన మొబైల్ ఉంటుంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుకులంగా మొబైల్ వినియోగం అవసరమే.. కానీ మొబైల్‌కు బానిసలైతే మాత్రం ప్రమాదం తప్పదంటున్నారు. అసలు విషయంలోకి వెళితే.. నేటి తరం యువత మొబైల్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటారు. కొందరు తినేటప్పుడు కూడా ఫోన్ చూస్తుంటారు.

కొందరైతే వాట్సాప్‌లో ఏం మిసేజ్ వచ్చింది.. ఎవరు ఫోన్ చేశారు.. ఇలా దృష్టి మొత్తం మొబైల్ పైనే పెడతారు. రీసెంట్‌గా ఫోన్ చూసుకుంటూ నడుస్తూన్న ఓ యువకుడికి జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యువత మొబైల్ ఫోన్‌కు బానిసలవుతున్నారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా మొబైల్‌ను వినియోగిస్తూ ముందు ఏం ఉందో కూడా చూడట్లేదు. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా అర్జెంటీనాలో ఓ యువకుడు ఫోన్‌లో లీనమైపోయి నడుస్తూ రైలు పట్టాలపైకి వెళ్లాడు. వేగంగా ట్రైన్ రావడంతో తేరుకొని వెనక్కి దూకడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.



Similar News