శరీరం నుంచి గుండెను తీయాలనుకున్నారు.. అంతలోనే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోతుంది.

Update: 2024-10-19 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోతుంది. ప్రస్తుత కాలంలో ఆశ్చర్యకరమైన ఘటనలు సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కోసి గుండెను తీయాలని చూడగా ఒక్కసారిగా అతను లేచాడు. గతంలో USAలో జరిగిన ఈ ఘటన తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. థామస్ అనే 36 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అవయవాలు చెక్ చేసేందుకు పరీక్ష చేయగా అతనిలో కదలిక, కళ్ల నుంచి నీరు రావడం కనిపించింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో వైద్యులు తదుపరి ప్రక్రియ స్టార్ట్ చేయగా గుండె తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Similar News