జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం..ఐఎండీ

జూన్‌లో దేశ వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెలలో 165.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 147.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.

Update: 2024-07-01 15:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జూన్‌లో దేశ వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెలలో 165.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 147.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 11శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం కాగా..2001 నుంచి ఇంత తక్కువగా వర్షపాతం నమోదవడం ఏడో సారి కావడం గమనార్హం. దేశంలో నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో నమోదైన మొత్తం 87 సెంటీమీటర్ల వర్షపాతం కంటే 15శాతం తక్కవ. ఈ ఏడాది అంచనాలకన్నా ముందే మే 30వ తేదీన కేరళ, ఈశాన్య ప్రాంతాలను తాకిన రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించాక వేగం కోల్పోయాయని ఐఎండీ తెలిపింది. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలో వర్షాలు కురవలేదని వెల్లడించింది. వాయువ్య భారతంలో 33 శాతం, మధ్య భారతంలో 14 శాతం, తూర్పు, ఈశాన్య భారతంలో 13 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు. అలాగే గత వారం ఢిల్లీని అతలాకుతలం చేసిన కుండపోత వర్షం మేఘాల విస్ఫోటనం వల్ల సంభవించలేదని స్పష్టం చేశారు. 

Similar News