హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి.. ఎట్టకేలకు స్పందించిన భోలే బాబా

మంగళవారం రోజు ఉత్తరప్రదేశ్ లోని హత్రాష్ జిల్లాలో బోలే బాబాకు సంబంధించిన సత్సంగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు.

Update: 2024-07-03 15:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం రోజు ఉత్తరప్రదేశ్ లోని హత్రాష్ జిల్లాలో బోలే బాబాకు సంబంధించిన సత్సంగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. ఎక్కడ ఏం జరిగిందో కానీ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై యూపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 108 మహిళలు, ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరింది.

121 మందిని బలితీసుకున్న ఘటనపై భోలే బాబా స్పందించారు. తాను సత్సంగ్ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన చాలా సేపటికి ఈ తొక్కిసలాట జరిగిందని, సమాజ వ్యతిరేక శక్తులే ఈ ఘటనకు కారణం అని చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రమాదంలో యూపీ ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది. ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు వెంటనే సేకరించాలని, 121 మంది ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.


Similar News