జమ్ముకశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2024-09-28 11:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయలయ్యాయి. దేవ్ సర్ ప్రాంతంలోని అదిగమ్ భద్రతబలగాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎన్‌కౌంటర్ లో అదనపు పోలీసు సూపరింటెండెంట్ ముంతాజ్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. కాగా.. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో పాల్గొన్న నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు, సెప్టెంబర్ 22 న కిష్త్వార్ జిల్లాలోని చత్రూ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

జమ్ముకశ్మీర్ లో పోలింగ్

ఇకపోతే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. జమ్ముకశ్మీర్ లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న తొలిదశ, 25న రెండో దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Similar News