HD Kumaraswamy: నన్ను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ కుట్ర.. కేంద్ర మంత్రి కుమారస్వామి

తనను జైలుకు పంపేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.

Update: 2024-09-28 13:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 12 ఏళ్ల నాటి కేసులో తనను జైలుకు పంపేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి, జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఒకవేళ ఇదే జరిగితే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్తలో 70 కేసులు నమోదయ్యాయని వాటి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆయనకు నిజాయితీ ఉంటే ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయని ప్రశ్నించారు. తనను కాపాడుకునేందుకే లోకాయుక్తను మూసివేసి ఏసీబీని ఏర్పాటు చేశారని విమర్శించారు. నా వద్ద ఉన్న కొన్ని పత్రాలను బయటపెడితే కర్ణాటక ప్రభుత్వంలోని ఐదు నుంచి ఆరుగురు కేబినెట్ మంత్రులు రాజీనామాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కుమారస్వామి ఆరోపణలన్నీ అవవాస్తవమని కొట్టి పారేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. బీజేపీ అవినీతిపరులతో నిండి ఉందని, వారిపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను మోడీ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.


Similar News