Factory blast: అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు సజీవ దహనం

హర్యానాలోని సోనిపట్‌లో పటాకుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

Update: 2024-09-28 13:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని సోనిపట్‌లో అక్రమంగా నడుస్తున్న పటాకుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం కాగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఈ ఫ్యాక్టరీని నడుపుతుండగా.. బాణసంచా తయారీలో ఉపయోగించే కెమికల్‌కు మంటలు అంటుకుని, భారీ పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలు తీవ్రంగా కాలిపోగా, ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఫ్యాక్టరీలోని సిలిండర్ పేలి ఘటన జరిగినట్టు పలు కథనాలు వెల్లడించాయి. దీనిపై కేసు నమోదు చేసిన సోనిపట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ పటాకుల ఫ్యాక్టరీని నడుపుతున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Similar News