Rahul Gandhi : రాహుల్‌గాంధీ ఏ1 నిందితుడు సిద్ధరామయ్య పక్షమేనా ? : బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ముడా భూములను భార్యకు అక్రమంగా కట్టబెట్టారనే అభియోగాలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఏ1 నిందితుడు సిద్ధరామయ్య పక్షానే రాహుల్ గాంధీ నిలబడతారా ?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈవిషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందన్నారు.
‘‘సీఎం స్థానంలో ఉండగా ఓ నేత అవినీతి కేసును ఎదుర్కోవడం చాలా అరుదు. కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి లీలలకు ఇదొక నిదర్శనం’’ అని సుధాంశు త్రివేది విమర్శించారు. ఇదే అంశంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ‘‘సీఎం సిద్ధరామయ్య ఇప్పటికైనా పదవికి రాజీనామా చేసి ముడా స్కాం కేసును ఎదుర్కోవాలి. అవినీతి అభియోగాలను ఎదుర్కొనే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.