ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు..జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడగింపు

మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ తగిలింది.

Update: 2024-06-18 13:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్ తగిలింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్డు మరో 14 రోజులు పొడిగించింది. ఈ మేరకు 42వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, రేవణ్ణ ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు లోక్ సభ ఎన్నికల టైంలో వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు. ఈ క్రమంలోనే మే 31న జర్మనీ నుంచి వచ్చిన రేవణ్ణను కర్ణాటకలోని కెంపెగౌడ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ విజ్ఞప్తి మేరకు కస్టడీని పొడిగించారు.

Similar News