గోల్డీ బ్రార్ సమాచారమిస్తే రూ.10లక్షలు.. ప్రకటించిన ఎన్ఐఏ

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బుధవారం ప్రకటించింది.

Update: 2024-06-26 17:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) బుధవారం ప్రకటించింది. అలాగే ఆయన సన్నిహితుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్‌ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇదే విధమైన రివార్డును అందజేస్తామని తెలిపింది. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తి రహస్యంగా ఉంచుతామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 8న దోపిడీ ప్రయత్నాల్లో భాగంగా ఒక వ్యాపారవేత్త ఇంట్లో కాల్పులు జరిపిన కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందని వెల్లడించింది. పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేశామని తెలిపింది. వీరి గురించిన సమాచారం తెలిస్తే.. ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్ కంట్రోల్ రూమ్ టెలిఫోన్ నంబర్: 011-24368800, వాట్సాప్/టెలిగ్రామ్: +91 8585931100, ఇమెయిల్: do.nia@gov.inలో సంప్రదించొచ్చని పేర్కొంది. కాగా, గోల్డీ బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉండి బిష్ణోయ్ ముఠా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

Similar News