హెర్షేతో సహా 60 ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ రీకాల్.. కారణమిదే?

లిస్టేరియా కాలుష్యం ప్రమాదం కారణంగా అమెరికాలో 60కి పైగా ఐస్‌క్రీం ఉత్పత్తులు దేశవ్యాప్తంగా రీకాల్ చేశారు. వీటిలో హెర్షేస్, ఫ్రెండ్లీస్, చిప్విచ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి.

Update: 2024-06-26 18:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లిస్టేరియా బ్యాక్టీరియా కారణంగా అమెరికాలో 60కి పైగా ఐస్‌క్రీం ఉత్పత్తులు దేశవ్యాప్తంగా రీకాల్ చేశారు. వీటిలో హెర్షేస్, ఫ్రెండ్లీస్, చిప్విచ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ మేరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌‌డీఏ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. లిస్టెరియా మోనోసైటోజెన్‌లతో కలుషితం అవుతుందనే కారణంతో డజనుకు పైగా బ్రాండ్ పేర్లతో విక్రయించబడుతున్న 60 ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ప్రభావిత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సరఫరా చేయబడ్డాయని పేర్కొంది.

ఐస్ క్రీమ్స్‌లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా వారిలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు అనారోగ్యం బారిన పడిన నివేదికలు ఏమీ లేవని ముందు జాగ్రత్తతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. రీకాల్ చేసిన ఉత్పత్తులను కలిగి ఉన్నవారిని పూర్తి రీఫండ్ కోసం కొనుగోలు చేసిన ప్రదేశానికి తిరిగి ఇవ్వాలని ఎఫ్‌డీఏ తన ప్రకటనలో వెల్లడించింది. వీటిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.


Similar News