Jp Nadda: మీ నాయకుల అకృత్యాలను మర్చిపోయారు.. ఖర్గే లేఖకు నడ్డా కౌంటర్

రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-19 05:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ఖర్గే లేఖపై బీజేపీ చీఫ్ నడ్డా స్పందించారు. ఈ మేరకు గురువారం ఖర్గేకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ సహా మీ నాయకులు చేసిన అకృత్యాలను మరచిపోయారా అని ప్రశ్నించారు. ఖర్గే చెప్పిన విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘ప్రజలచే పదేపదే తిరస్కరించబడిన మీరు. తిరిగి మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ లేఖ రాసినట్టు అర్థమవుతోంది’ అని తెలిపారు. ‘రాహుల్ దేశ ప్రధానితో సహా మొత్తం ఓబీసీ వర్గాన్ని దొంగలు అంటూ దుర్భాషలాడారు. దేశ ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించారు. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తిని మీరు బలవంతంగా ఎలా సమర్థిస్తారు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన దుశ్చర్యలను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్లు లేఖలో కనిపిస్తోందని ఆరోపించారు.


Similar News