Atishi : 21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి శనివారం (సెప్టెంబరు 21న) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Update: 2024-09-19 17:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి శనివారం (సెప్టెంబరు 21న) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆమెతో పాటు పలువురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈవిషయాన్ని ఆప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 43 ఏళ్ల అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

అంతకుముందు ఢిల్లీ సీఎంగా వ్యవహరించిన మహిళా మణుల్లో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఉన్నారు. మనీశ్ సిసోడియా ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో ఆయనకు అడ్వైజర్‌గా అతిషి వ్యవహరించారు. ఢిల్లీలో ప్రభుత్వ విద్యాలయాలను కార్పొరేట్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.


Similar News