J&K: పాక్ తన స్వంత వ్యవహారాలు చూసుకోవడం మంచిది: ఒమర్ అబ్దుల్లా
పాకిస్థాన్ తమ స్వంత వ్యవహారాలను చూసుకోవాలని, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా గురువారం మాట్లాడుతూ.. పాకిస్థాన్ తమ స్వంత వ్యవహారాలను చూసుకోవాలని, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. 'పాకిస్తాన్‌కు మనకు సంబంధం ఏమిటి? మనం పాకిస్తాన్‌లో భాగం కాదు, వారు తమ దేశాన్ని చూసుకోవాలి. వారు మన ఎన్నికలలో జోక్యం చేసుకోవాలని లేదా మన ఎన్నికలపై వ్యాఖ్యానించాలని నేను అనుకోను. వాళ్ల ప్రజాస్వామ్యాన్ని వారు కాపాడుకోవాలి' అని ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. పాకిస్థాన్ ఏం చెప్పిందనేది నాకు తెలియదు.. నేను పాకిస్థానీ కాదు.. భారత పౌరుడిని. పాక్ వ్యాఖ్యలను పట్టించుకోనని పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరణ జరుగుతుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఓ ప్రకటనలో అన్నారు.