Congress: జిన్నా అడుగుజాడల్లో కాంగ్రెస్: బీజేపీ

ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

Update: 2024-09-19 16:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు సంబంధించి కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా గురువారం స్పందించారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తోందని అన్నారు. ' చైనా, పాకిస్తాన్‌లతో కాంగ్రెస్‌కు, గాంధీ కుటుంబానికి ఏం సంబంధం ఉంది. ఎందుకని పాకిస్థాన్ కాంగ్రెస్, ఎన్‌సీతో పొత్తుపై మాట్లాడుతోంది. దీని ద్వారా కాంగ్రెస్ జిన్నా అడుగుజాడల్లో నడుస్తోందని స్పష్టమైంది. కాంగ్రెస్ జమ్మూకశ్మీర్‌ను విచ్ఛిన్నం చేయాలనుకుంటోంది. దీనిపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని' డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, పాకిస్తాన్‌ల ఉద్దేశాలు, ఎజెండా ఒకే విధంగా ఉన్నాయని పాక్ మంత్రి ప్రకటన స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370, 35ఏపై కాంగ్రెస్, జేకేఎన్సీ మద్దతు గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని మరోసారి బట్టబయలు చేసింది. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి భారత వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తున్నారని ట్వీట్ చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఓ ప్రకటనలో అన్నారు. 

Tags:    

Similar News