NEET-UG: నీట్ యూజీపై నిపుణుల ప్యానెల్ సిఫార్సులు అమలు చేస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

నీట్-యూజీ పరీక్షకు సంబంధించి నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Update: 2025-01-02 16:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్-యూజీ (Neet Ug) పరీక్షకు సంబంధించి నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టు (Supree court)కు తెలిపింది. ప్రభుత్వం తీసుకునే చర్యలను న్యాయమూర్తులు పీఎస్‌ నరసింహ, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా (Thushar mehatha) వివరించారు. నిపుణుల కమిటీ తన నివేదికను దాఖలు చేసిందని తెలిపారు. నీట్ యూజీ నిర్వహణకు కమిటీ సూచించిన అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ కేసు విచారణను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. అయితే బెంచ్ మూడు నెలలు వాయిదా వేసింది. కాగా, గతేడాది నీట్ వివాదం అనంతరం నీట్-యూజీ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరును సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News