Ekta Sthal: ఏక్తా స్థల్ లేదా విజయ్ ఘాట్‌లో మన్మోహన్ స్మారక చిహ్నం !

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు ఏక్తా స్థల్, విజయ్ ఘాట్‌ లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Update: 2025-01-02 18:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan singh) స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు ఏక్తా స్థల్(Ektha sthal), విజయ్ ఘాట్‌(Vijay ghat) లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి హోం మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు ప్రదేశాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ప్రతిపాదిత స్థలాల గురించి త్వరలో మన్మోహన్ కుటుంబ సభ్యులకు తెలియజేయనుండగా ఆ తర్వాత భూకేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాజీ ప్రధాని స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, గతేడాది డిసెంబర్ 23న మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News