Jan Suraj: బీహార్‌కి రాజీవ్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది..? ప్రశాంత్ కిషోర్ సూటి ప్రశ్న
బీహార్ కు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Former PM Rajeev Gandhi) ఇచ్చిన హామీ ఏమైందో రాహుల్ గాంధీ చెప్పాలని జన్ సురాజ్(jan Suraj) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashanth Kishor) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ కు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Former PM Rajeev Gandhi) ఇచ్చిన హామీ ఏమైందో రాహుల్ గాంధీ చెప్పాలని జన్ సురాజ్(jan Suraj) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashanth Kishor) ప్రశ్నించారు. శనివారం పాట్నా(Patna)లో జరిగిన సంవిధాన్ సురక్షా సమ్మేళనంలో(Samvidhan Suraksha Summit) రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్జేడీ(RJD)కి మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) బీహార్(Bihar) దుస్థితికి ఎలాంటి పాత్ర పోషించిందో రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
అలాగే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు, 1989లో బీహార్‌కు 50 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడాడు కానీ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. ఇక పాట్నాలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) అభ్యర్థులతో లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరాగ్ పాశ్వాన్(Chiragh Pashwan) అయినా, రాహుల్ గాంధీ అయినా, తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) అయినా.. బీహార్ యువతకు మద్దతుగా నేతలందరూ నిలవాలని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ రాహుల్ గాంధీ రావడం ఆలస్యమైందని, ఈ విషయం ఇప్పటికే కోర్టుకు చేరిందని తెలిపారు. ఇక ఇప్పటికైనా యువతకు కాంగ్రెస్ కూడా అండగా నిలవాలని, విద్యార్థులకు న్యాయం చేసేందుకు న్యాయ సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేశారు.