Karnataka Bandh : రేపు కర్ణాటక బంద్ కు పిలుపు
కన్నడ సంఘాలు శనివారం కర్ణాటక రాష్ట్రవ్యాప్త బంద్‌కు(Karnataka bandh ) పిలుపునిచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ సంఘాలు శనివారం కర్ణాటక రాష్ట్రవ్యాప్త బంద్‌కు(Karnataka bandh ) పిలుపునిచ్చాయి. ఇటీవల బెలగావిలో కేఎస్ఆర్టీసీ(KSRTC) బస్సు కండక్టర్(Bus Conductor Incident)పై మరాఠీలో సమాధానం చెప్పనందుకు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా రేపు కన్నడ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలపాటు ఈ బంద్ కొనసాగనుంది. ఎస్‌ఎస్‌ఎల్‌సి(SSLC) పరీక్షలు శనివారం లేనందున రేపు బంద్ జరుపుతున్నట్టు కన్నడ సంఘాలు ప్రకటించాయి. అయితే దిగువ తరగతుల పరీక్షలు యధావిధిగా జరుపుకోవచ్చని తెలిపాయి. ఈ బంద్ కు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు మద్దతు ప్రకటించడంతో బెంగళూరులో లక్షలాది ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే కేఎస్ఆర్టీసీ బస్సులపై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ బంద్ పిలుపుతో మరోసారి కన్నడ-మరాఠీ భాష వివాదం(Kannada-Maratha Issue) మరోసారి రచ్చకు ఎక్కనుంది.