AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి.. ముగ్గురికి కీలక బాధ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం పార్టీ నేతలు సమావేశం అయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఓడిన ముగ్గురు కీలక నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేందర్ జైన్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఢిల్లీ ఆప్ విభాగానికి సౌరబ్ భరద్వాజ్, పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా మనీశ్ సిసోడియాను, పంజాబ్ కో ఇన్ ఛార్జ్ గా సత్యేంద్ర జైన్‌ను నియమించారు. సౌరబ్ భరద్వాజ్.. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే రెండు సంవత్సరాలు ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఇప్పుడుఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా సౌరభ్ భరద్వాజ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
నాలుగు రాష్ట్రాలకు ఇన్ ఛార్జిలు
మరోవైపు మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఇక ఆప్ జమ్ముకశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహారాజ్ మాలిక్‌ను నియమించింది. సీనియర్ నాయకులు గోపాల్ రాయ్ ను గుజరాత్ ఇన్ ఛార్జిగా, దుర్గేష్ పాఠక్ లను కో ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పంకజ్ గుప్తాను గోవా ఆప్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. మనీష్ సిసోడియాను పంజాబ్ ఇన్‌చార్జ్‌గా, సత్యేంద్ర జైన్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు. గోవాకు ఆప్ ఇన్‌చార్జ్‌గా పంకజ్ గుప్తా వ్యవహరించనున్నారు. పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అతిషికి ప్రతిపక్ష హోదా దక్కింది.