Amit Shah: దేశ అభివృద్ధికి ఉగ్రవాదం అతిపెద్ద సమస్య- అమిత్ షా

కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) రాజ్యసభలో మాట్లాడారు. మోడీ నేతృత్వంలోనే కేంద్రం ఉగ్రవాదంపై కఠిన వైఖరిని అనుసరిస్తోందని అన్నారు.

Update: 2025-03-21 13:17 GMT
Amit Shah: దేశ అభివృద్ధికి ఉగ్రవాదం అతిపెద్ద సమస్య- అమిత్ షా
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) రాజ్యసభలో మాట్లాడారు. మోడీ నేతృత్వంలోనే కేంద్రం ఉగ్రవాదంపై కఠిన వైఖరిని అనుసరిస్తోందని అన్నారు. కశ్మీర్‌లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. అక్కడి యువత ఉద్యోగాలు చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదుల పట్ల కఠిన చూపలేదని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘జమ్ముకశ్మీర్‌, ఈశాన్య భారతంలోని ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ అభివృద్ధికి తీవ్ర సమస్య. వాటి వల్ల 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మోడీ హయంలో జమ్ముకశ్మీర్ లో టెర్రరిజం వల్ల 70 శాతం మరణాలు తగ్గాయి. ఉగ్రదాడుల ఘటనలు చాలావరకు తగ్గాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను నెరవేరింది. ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం కూడా సినిమా థియేటర్లు తెరిచే ఉంటున్నాయి. జీ20 సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 వరకు అక్కడి యువతకు 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి’’ అని చెప్పుకొచ్చారు

పాక్ కు బుద్ధి చెప్పాం

సర్జికల్ స్ట్రయిక్స్ గురించి రాజ్యసభలో అమిత్ షా ప్రస్తావించారు. ఉరి, పుల్వామా ఘటనలు జరిగిన రోజుల వ్యవధిలో సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ చేసి పాక్ కు గట్టిగా బుద్ధఇచెప్పామన్నారు. అంతేకాకుండా.. అంతేకాకుండా, కేంద్రహోంశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా అమిత్‌ షా వెల్లడించారు. మార్చి 31, 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమవుతుందన్నారు. రాజకీయ భావజాలం మద్దతున్న ఉగ్రవాదాన్ని విస్తరించకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే రూ.1.25 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశామని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News