Sambhal Violence: సంభాల్ హింస కేసులో జామా మసీదు కమిటీ అధ్యక్షుడు అరెస్టు

ఉత్తరప్రదేశ్ సంభాల్ హింస కేసులో జామా మసీదు కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది జాఫర్ అలీ అరెస్టయ్యారు. అల్లరిమూకను రెచ్చగొట్టడం, తప్పుడు ఆధారాలు సృష్టించడం సహా అల్లర్లు చెలరేగడంతో ఆయన్ని మాస్టర్ మైండ్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Update: 2025-03-23 13:06 GMT
Sambhal Violence: సంభాల్ హింస కేసులో జామా మసీదు కమిటీ అధ్యక్షుడు అరెస్టు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ సంభాల్ హింస కేసులో జామా మసీదు కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది జాఫర్ అలీ అరెస్టయ్యారు. అల్లరిమూకను రెచ్చగొట్టడం, తప్పుడు ఆధారాలు సృష్టించడం సహా అల్లర్లు చెలరేగడంతో ఆయన్ని మాస్టర్ మైండ్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతని అరెస్టుకు ముందు పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి జాఫర్ అలీని అదుపులోకి తీసుకుంది.సంభాల్ కొత్వాలి ఇన్‌ఛార్జ్ అనుజ్ కుమార్ తోమర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతేడాది నవంబర్ 24న జరిగిన హింసకు సంబంధించిన కేసులో ప్రశ్నించేందుకే.. సిట్ జాఫర్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సంభాల్ హింస

గతేడాది ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో హింస చెలరేగింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లి మూక దాడులకు పాల్పడింది. ఈ అల్లర్లలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించి, యూపీ పోలీసులు ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు. సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్‌ను కూడాఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అరెస్టు తర్వాత ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీసులు కస్టడీలో ఉన్న జాఫర్ అలీ చిత్రాలను విడుదల చేశారు.

Tags:    

Similar News