Prashanth: నితీశ్‌కు కొంచెం మెంటల్.. జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ విమర్శలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. నితీశ్ మానసికంగా అలసిపోయారని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) పై జన్ సూరజ్ (Jan suraj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్ శారీరకంగా, మానసికంగా అలసిపోయారని ఆరోపించారు. ఆయన బలహీనత కారణంగా రాష్ట్రంలో పాలనా సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు. సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘నితీష్ కుమార్ ఆరోగ్యంపై మొదట వ్యాఖ్యానించిన వ్యక్తి ఆయన మిత్రుడు సుశీల్ కుమార్ మోడీ (Sushil kumar modi). అప్పటి నుంచి చాలా మంది బిహార్ మంత్రులు ఆయన హెల్త్ కండిషన్ పై మాట్లాడారు. జనవరి వరకు నేను దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. కానీ బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిరసనల సమయంలో నితీశ్ మానసిక పరిస్థితి చాలా క్షీణించిందని తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలియదని గ్రహించా’ అని చెప్పారు.
నితీశ్ మానసికంగా అసమర్థుడని ప్రధాని నరేంద్ర మోడీ (Naredra modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah)లకు కూడా తెలుసే ఉంటుంది, కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో కొనసాగడానికి ఆయనను ఒక ముసుగుగా ఉపయోగించుకుంటున్నాని ఫైర్ అయ్యారు. ప్రజా నిధులను నితీశ్ దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై నితీశ్ కుమారుడు నిషాంత్ స్పందించారు. తన తండ్రి వంద శాతం ఆరోగ్యంగా ఉన్నారని మరో పదవీ కాలం కూడా ప్రజా సేవ చేయగలరని నొక్కి చెప్పారు. ప్రశాంత్ ఆరోపణలు పూర్తిగా అవాస్తమవమని కొట్టి పారేశారు.