రూ.60కే కేజీ.. “భారత్ దాల్” శెనగ పప్పు

ఇప్పటికే ధరల మంటతో పేదలు టమాటాను కూరల్లో వాడటం మానేశారు.

Update: 2023-07-19 10:46 GMT

న్యూఢిల్లీ : ఇప్పటికే ధరల మంటతో పేదలు టమాటాను కూరల్లో వాడటం మానేశారు. మరోవైపు పప్పుల ధరలు కూడా అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో శెనగ పప్పు ధర కిలోకు రూ.70 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. ఈ నేపథ్యంలో పప్పుల ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో “భారత్ దాల్” బ్రాండ్ పేరుతో సరసమైన ధరలకు శెనగ పప్పు ప్యాకెట్లను కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ పప్పు ప్యాకెట్ల విక్రయాలు అధికారికంగా సోమవారం (జులై 16) నుంచే ప్రారంభమయ్యాయి.

“భారత్ దాల్” బ్రాండ్ ద్వారా కిలో శెనగ పప్పును వినియోగదారులకు రాయితీపై రూ. 60కే విక్రయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 703 నాఫెడ్ స్టోర్‌లు, NCCF, కేంద్రీయ భండార్, మదర్ డైరీ సఫల్ రిటైల్ స్టోర్‌లలో “భారత్ దాల్”ను విక్రయిస్తారు. “భారత్ దాల్” 1 కేజీ ప్యాకెట్ ధర రూ.60.. 30 కేజీల ప్యాకెట్ ఒకేసారి తీసుకుంటే కేజీకి రూ.55 చొప్పునే పడుతుంది. సబ్సిడీ ధరలతో భారత్ దాల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా శెనగ పప్పు ధరలు కూడా దిగివస్తాయని అంచనా వేస్తున్నారు.


Similar News