Congress : మణిపూర్ ప్రజల ఎదురుచూపులు.. కులాసాగా కువైట్‌కు మోడీ : జైరాం రమేశ్
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇంఛార్జి జైరాం రమేశ్ విమర్శలతో విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇంఛార్జి జైరాం రమేశ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్(Manipur)లోని ప్రజలు ప్రధాని మోడీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చేస్తున్నారు. మోడీ(PM Modi) మాత్రం వాళ్ల గోడును పట్టించుకోకుండా తనదైన శైలిలో కులాసాగా కువైట్‌కు వెళ్లిపోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘విదేశాలకు చక్కర్లు కొట్టే ప్రధానిగా మోడీ మారిపోయారు. ఈసారి ఆయన కువైట్(Kuwait)కు వెళ్లారు. మణిపూర్ ప్రజలు అనుభవిస్తున్నది వాళ్ల ఖర్మ అని మోడీ అనుకుంటున్నారు కాబోలు. అందుకే ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు ఆయన డేట్‌ను కేటాయించ లేకపోతున్నారు. మణిపూర్ ప్రజలకు మోడీ మిగిల్చింది ఎదురు చూపులు మాత్రమే’’ అని జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తే.. అక్కడి పరిస్థితులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు.