అదృష్టమంటే ఆ ఉద్యోగులదే..ఏకంగా 8 నెలల జీతం బోనస్
కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన సిబ్బందికి బంపరాఫర్ అందించింది.
దిశ,వెబ్‌డెస్క్: కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన సిబ్బందికి బంపరాఫర్ అందించింది. ఎనిమిది నెలలు జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంచనాలకు మించి లాభాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో విమానయాన రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది.
దీంతో మార్చి ముగిసే సమయానికి ఎయిర్‌లైన్ నికర ఆదాయం 24శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘ది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్’ అవార్డును గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు.