Election Results-2024: హర్యానా, జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ హవా.. ముందంజలో పలువురు ప్రముఖులు

హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

Update: 2024-10-08 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారనే ఉత్కంఠ అక్కడి ప్రజల్లో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 90 అసెంబ్లీ స్థానాలకు గాను 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాద్‌షాపూర్, గురుగ్రామ్, పటౌడీలో మాత్రమే రెండు చొప్పున కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. మిగిలిన 87 స్థానాలకు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఉండగా.. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్‌లో స్పష్టంగా కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 54 చోట్ల, బీజేపీ (BJP) అభ్యర్థులు 31 స్థానాల్లో, ఇతరులు5 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జులానా నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన వినేష్ ఫోగట్ ముందజలో కొనసాగడం విశేషం. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడా లీడ్‌లో కొనసాగుతున్నారు. లాడ్వాలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఆధిక్యంలో ఉన్నారు.

జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌‌ను ప్రక్రియను‌ నిర్వహించగా.. 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా ఆర్టికల్-370 (Article-370) రద్దు తరువాత జరిగే మొట్టమొదటి ఎన్నికలు కావడంతో వెలువడే ఫలితాలపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress), ఎన్‌సీ (Jammu and Kashmir National Conference) పార్టీలు కలిసి పోటీ చేశాయి. మరోవైపు బీజేపీ, పీడీపీ సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగాయి. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ (Jammu & Kashmir)లో 77 స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ 45 స్థానాల్లో, బీజేపీ 31 చోట్ల, ఇతరులు 14 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో లీడ్‌లో కొనసాతున్నారు.

రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని పదర్శిస్తుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సంబురాలు మొదలయ్యాయి. డప్పుచప్పుళ్ల మధ్య కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెడుతున్నారు.


Similar News