Manipur Congress chief: మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కు ఈడీ సమన్లు.. రాజకీయ ప్రతీకారం అని కాంగ్రెస్ ఆరోపణలు

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కె. మేఘచంద్ర సింగ్ కు ఈడీ సమన్లు పంపింది.

Update: 2024-10-08 05:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కె. మేఘచంద్ర సింగ్ కు ఈడీ సమన్లు పంపింది. కాగా.. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. దర్యాప్తు సంస్థ చర్యలను విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసినందుకు మేఘచంద్ర సింగ్ పై "రాజకీయ ప్రతీకారం" తీర్చుకున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌లకు వ్యతిరేకంగా గళం విప్పిన మేఘచంద్రను మౌనంగా ఉంచేందుకే సమన్లు జారీ చేశారని ఆరోపించారు.

ఈడీ సమన్లు

ఇకపోతే, కె.మేఘచంద్రకు అక్టోబరు 3న ఈడీ సమన్లు పంపింది. దర్యాప్తునకు సంబంధించిన ఆధారాలు అందించేందుకు, రికార్డులు సమర్పించేందుకు సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. అయితే, మేఘచంద్ర మాత్రం ఈడీ ఎదుట హాజరుకాలేదు. తనకు సోమవారమే సమన్లు అందాయని.. అందుకే కఈడీ ఎట హాజరుకాలేకపోయాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈడీ తనను ఎందుకు పిలిచిందో అర్థం కావడం లేదని.. తాను ఎమ్మెల్యే లేదా మంత్రిని కాదని చురకలు అంటించారు. మరోవైపు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎన్ బుపేంద్ర మైతేయ్ సోషల్ మీడియాలో మేఘచంద్రకు తన మద్దతును తెలిపారు. ఈ విషయంలో పార్టీ న్యాయపరంగా పోరాడుతోందని ప్రకటించారు.


Similar News