కశ్మీర్.. 'కాంగ్రెస్ ముక్త్' అయింది : G. Kishan Reddy

ప్రస్తుతం దేశం చూపు హరియాణా(Hariyana), జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) ఎన్నికల ఫలితాలపై ఉంది.

Update: 2024-10-08 11:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం దేశం చూపు హరియాణా(Hariyana), జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) ఎన్నికల ఫలితాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై కేంద్రమంత్రి, బీజేపీ జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హరియాణలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జమ్మూ కాశ్మీర్లో ముందుకంటే ఎక్కువ సీట్లే సాధించింది. ఈ ఫలితాలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనన్ని సీట్లు సాధించింది అన్నారు. రాహుల్ గాంధీ చాలా తెలివిగా ప్రజల్లో మోడీ పట్ల విశ్వాసాన్ని తగ్గించాలని చూశారు. ఇందుకోసం విదేశీ పర్యటనలను సైతం వాడుకున్నారు. కాని 'మోడీ 3.0'(Modi 3.0) తో తొలి 100 రోజుల్లో చేసిన అభివృద్ది ఫలితం హరియాణా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్ ఫలితాలతో పోలిస్తే.. బీజేపీదే పైచేయి అని తెలియ జేశారు. ఈ ఫలితాలతో కాశ్మీర్ ఇపుడు 'కాంగ్రెస్ ముక్త్' అయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Similar News