జమ్ము కశ్మీర్ ప్రజలకు ప్రధాని మోడీ కీలక హామీ

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) స్పందించారు.

Update: 2024-10-08 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. జమ్ము కశ్మీర్ బీజేపీ నేతల పనితీరు పట్ల గర్వపడుతున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏమాత్రం వెనక్కి తగ్గుకుండా పార్టీ కార్యకర్తలంతా చివరి వరకూ అద్భుతంగా పనిచేశారని అభినందించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌‌లో విజయం సాధించిన ఇండియా కూటమికి అభినందనలు తెలిపారు. హర్యానా ఎన్నికల ఫలితాలపైనా మోడీ ట్వీట్ పెట్టారు. హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అన్నారు. హర్యానాలో మరోసారి బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీని మరోసారి గెలిపించాయని అభిప్రాయపడ్డారు. కాగా, జమ్ము కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇండియా కూటమి 49 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 29 స్థానాల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది.


Similar News