Jalebi is trending : హర్యానాలో అనూహ్య ఫలితాలు.. ట్రెండింగ్‌లో జిలేబి

హర్యానా, జమ్మూ,కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలకు ఉహించని విధంగా షాక్ ఇచ్చాయి.

Update: 2024-10-08 14:05 GMT

దిశ, వెబ్ డెస్క్: హర్యానా, జమ్మూ,కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలకు ఉహించని విధంగా షాక్ ఇచ్చాయి. ఉదయం కొద్దిసేపు మాత్రమే సర్వే సంస్థల అంచనాలకు అనుగుణంగా కొనసాగిన ట్రెండ్.. కొద్దిసేపటికే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో హర్యానాలో ఎవరూ ఊహించని విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో మొత్తం 48 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ మూడో సారి అధికారంలోకి రాబోతుంది. అలాగే జమ్మూ, కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోయినప్పటికీ.. గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అలాగే జమ్మూ లో అనేక స్థానాల్లో విజయం సాధించిన చరిత్ర సృష్టించింది.

ఈ రెండు రాష్ట్రాల ఫలితాల వేళ సోషల్ మీడియాలో జిలేబీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. హర్యానా రాష్ట్రంలోని ఓ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జిలేబీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఆ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్న అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు ఓడిపోయారని.. జిలేబీ బాబా ప్రచారం చేస్తే ఇలానే ఉంటుందని.. కామెంట్ పెడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా హర్యాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలకు, పార్టీ కార్యాలయాలకు బీజేపీ నేతలు జిలేబీని పంపిస్తున్నారు.

Tags:    

Similar News