జమ్ము కశ్మీర్‌లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఘన విజయం

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM) అభ్యర్థి ఘన విజయం సాధించారు.

Update: 2024-10-08 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM) అభ్యర్థి ఘన విజయం సాధించారు. కుల్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహ్మద్ యూసుఫ్ తరిగామి(Mohammed Yousuf Tarigami) ఘన విజయం సాధించారు. కాగా, ఇది ఆయనకు వరుసగా ఐదో విజయం కావడం విశేషం. మరోవైపు.. జమ్మ కశ్మీర్‌‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక, బీజేపీ 28, పీడీపీ 2, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో (ఆధిక్యం/గెలుపు) కొనసాగుతున్నారు. ఇక్కడ, భాజపా, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తులో ఉన్నాయి.


Similar News