Election Results-2024: హర్యానాలో సీన్ రివర్స్.. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ

హర్యానా (Haryana)లో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠను తలపిస్తోంది.

Update: 2024-10-08 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana)లో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠను తలపిస్తోంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 54 స్థానాల్లో.. బీజేపీ అభ్యర్థులు 31 స్థానాల్లో లీడ్‌ కొనసాగారు. అయితే, ఉదయం 10 దాటేసరికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తొలుత పూర్తిగా వెనకబడి ఉన్న కమలనాథులు అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రస్తుతం బీజేపీ (BJP) అభ్యర్థులు 49 స్థానాల్లో.. కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 34 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏ పార్టీకైనా 46 స్థానాలు అవసరం. అయితే, అక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేసినా.. ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం.

కాగా, హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను అధికారులు 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాద్‌షాపూర్, గురుగ్రామ్, పటౌడీలో మాత్రమే రెండు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మిగిలిన 87 స్థానాలకు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఉండగా ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  


Similar News