Haryana results 2024: ఓటమి దిశగా చౌతాలా కుటుంబసభ్యులు..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తున్నాయి. బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తూ కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇస్తుంది.

Update: 2024-10-08 09:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తున్నాయి. బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తూ కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇస్తుంది. ఇకపోతే చౌతాలా కుటుంబానికి చెందిన ఐఎన్ఎల్డీపీ, జేజేపీ పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. అర్జున్ చౌతాలా మినహా హర్యానా ఎన్నికల్లో పోటీ చేసిన చౌతాలా కుటుంబ సభ్యులందరూ వెనుకంజలోనే ఉన్నారు. ఒకప్పుడు హర్యానాను పాలించిన ఓం ప్రకాష్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కేవలం ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. ఎల్లెనాబాద్‌లో ఆ పార్టీకి చెందిన అభయ్‌సింగ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి భరత్‌సింగ్‌ బేనీవాల్‌ ముందంజలో ఉన్నారు.అభయ్ చౌతాలా కుమారుడు అర్జున్ చౌతాలా రానియా నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా నిలిచిన జేజేపీ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానంలో కాంగ్రెస్ నేత బ్రిజేంద్ర సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.

ఓటమి దిశగా చౌతాలా కుటుంబసభ్యులు

సిర్సాలోని దబ్వాలి నియోజకవర్గంలో దుష్యంత్ చౌతాలా సోదరుడు దిగ్విజయ్ సింగ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఐఎన్‌ఎల్డీకి చెందిన సునైనా చౌతాలా ఫతేబాద్‌లో ఓటమి దిశగా వెళ్తున్నారు. ఆస్థానంలో బీజేపీకి చెందిన దుర‌రామ్ ఆధిక్యంలో ఉన్నారు. 2018లో అభయ్ చౌతాలాతో విబేధాల కారణంగా దుష్యంత్ చౌతాలా, దిగ్విజయ్ చౌతాలాలను ఐఎన్ఎల్డీ బహిష్కరించింది. దీంతో, ఓం ప్రకాష్ చౌతాలా కుటుంబం నిలువునా చీలిపోయింది. డిసెంబర్ 2018లో జింద్‌లో జరిగిన ర్యాలీలో జేజేపీ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ అద్భుతమైన పనితీరుని కనబరిచింది. పది స్థానాలు కైవసం చేసుకుంది. 14 శాతానికి పైగా ఓట్లను పొందింది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ సంఖ్య తక్కువగా ఉండంటంతో దుష్యంత్ చౌతాలా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో జేజేపీ.. కాషాయ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని కూలిపోకుండా బీజేపీ అధిష్ఠానం అడ్డుకుంది.


Similar News