Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ నెక్ట్స్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారుచేస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం వైపునకు దూసుకెళ్తోంది.

Update: 2024-10-08 10:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారుచేస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం వైపునకు దూసుకెళ్తోంది. ఎన్నికల ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ టైంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) సీఎంగా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు.‘‘పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. ఆగస్టు 5 నాటి ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని అంగీకరించడం లేదు. ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుంది’’ అని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఇకపోతే, జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటివరకు నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యం, విజయం కలిపి 41 స్థానాలతో దూసుకెళ్తోంది. బీజేపీ 29 స్థానాల్లో ముందజలో ఉండగా.. పీడేపీ 4, కాంగ్రెస్ 5, ఇతరులు 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. 


Similar News