ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. రెండు రాష్ట్రాల్లోనూ సీన్ రివర్స్?

హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. క్షణక్షణానికి నంబర్లు మారుతుండటంతో గెలుపుపై ఇరు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-10-08 05:58 GMT

దిశ, వెబ్ డెస్క్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారైనట్లే కనిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జమ్ము కశ్మీర్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొన్ని సంస్థలు.. మరికొన్ని సంస్థలు బీజేపీ హవానే ఉంటుందని భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. ఈరోజు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపించడం లేదు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపు బీజేపీ, మరికాసేపు కాంగ్రెస్ లీడింగ్ లోకి వస్తున్నాయి. అరగంట క్రితం బీజేపీ 42 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. ఉదయం 11.30 గంటలకు బీజేపీ 44, కాంగ్రెస్ 39 స్థానాల్లో ముందంజలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. ఎవరికి వారే హర్యానాలో విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య తీవ్రపోటీ నెలకొనడంతో.. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుంది. కాంగ్రెస్ గెలిస్తే.. కొత్త ఆశలు చిగురిస్తాయి.

జమ్ము కశ్మీర్లో ఈసారి ఆర్టికల్ 370 బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందని అంతా భావించారు. కానీ.. ఎగ్జిట్ పోల్స్ లో హంగ్ విజయం సాధిస్తుందని తెలిసింది. కాంగ్రెస్ కూటమికి 46 నుంచి 50 స్థానాలు దక్కుతాయని, ఎన్డీయేకు 23 నుంచి 27 స్థానాలే వస్తాయని వెల్లడించాయి ఎగ్జిట్ పోల్స్. ప్రస్తుతం ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ 41, బీజేపీ 26, పీడీపీ 4, కాంగ్రెస్ 10 స్థానాల్లో, స్వతంత్రులు 9 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. 


Similar News