Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్‌‌కు బిగ్ షాక్.. 2 వేల ఓట్ల తేడాతో వెనుకంజ

హర్యానా (Haryana)లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

Update: 2024-10-08 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana)లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణక్షణం.. రౌండ్‌ రౌండ్ అధిక్యాలు తారుమారు అవుతుండటంతో తుది గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్‌లో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థులు మెల్లిమెల్లిగా తమ లీడ్ కోల్పోతున్నారు. తాజాగా, జులానా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) తొలి నుంచి లీడ్‌లో కొనసాగారు.

అయితే, ఉదయం 10 గంటల తరువాత వరుస రౌండ్లలో తమ ఆధిక్యాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆమెపై బీజేపీ అభ్యర్థి యోగేశ్‌ కుమార్‌ (Yogesh Kumar) 2 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో వినేష్ ఫోగాట్ (Vinesh Phogat) కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ (BJP) అభ్యర్థులు 43 స్థానాల్లో.. కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 40 స్థానాల్లో, ఇతరులు7 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏ పార్టీకైనా 46 స్థానాలు అవసరం. 


Similar News