Chandrayaan-3: జాబిల్లి చేరువలో చంద్రయాన్-3..

చంద్రయాన్-3 చందమామ సమీపానికి దూసుకెళ్తోంది. జూలై 14వ తేదీన ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక

Update: 2023-08-04 14:30 GMT

బెంగళూరు: చంద్రయాన్-3 చందమామ సమీపానికి దూసుకెళ్తోంది. జూలై 14వ తేదీన ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక ఇప్పటికి మూడింట రెండొంతుల దూరం ప్రయాణాన్ని పూర్తి చేసిందని ఇస్రో శుక్రవారం తెలిపింది. మూడు వారాల్లో భూ కక్షలో ఐదు రౌండ్లు తిరిగిన చంద్రయాన్-3 ఆగస్టు ఒకటో తేదీన చంద్రుని కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. శనివారం చంద్రుని కక్షలో తిరగడం ప్రారంభిస్తుంది.

లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్‌ను ఈ నెల 5వ తేదీ రాత్రి 7 గంటలకు సెట్ చేశామని బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3 చంద్రుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఈ విన్యాసాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నది. చంద్రయాన్-3 ఇప్పటివరకు సరిగ్గానే ప్రయాణిస్తోందని, చంద్రుని ఉపరితలంపై ఈ నెల 23వ తేదీన ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.


Similar News