Jharkhand: జార్ఖండ్ డీజీపీని తక్షణమే తొలగించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

జార్ఖండ్‌ డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-10-19 10:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ శనివారం ఆదేశాలు జారీ చేసింది. క్యాడర్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సీనియర్ అధికారికి తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని తెలిపింది. ఈ ఆర్డర్స్ తక్షణమే అమలులోకి రావాలని సాయంత్రం 7 గంటల లోపు తన నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. గత ఎలక్షన్స్‌లో అనురాగ్ గుప్తాపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పక్ష పాతిగా వ్యవహరిస్తున్నట్టు పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈసీకి పలు ఫిర్యాదులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 


Similar News