Delhi Liquor Policy :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ నవంబర్ 8కి వాయిదా

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది.

Update: 2024-10-19 06:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టిన అనంతరం 8వ తేదీకి వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ఛార్జ్‌షీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కాగాఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ తో పాటు మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ, సీబీఐ కేసుల్లో నిందితులు విచారణ ఎదుర్కోంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాతో పాటు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కొన్ని రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే వారంతా బెయిల్ పోందగా, తాజాగా మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ నిన్న సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలపై విడుదలయ్యారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, సౌత్ గ్రూప్"గా పిలువబడే ఒక మద్యం లాబీ ఆప్ పార్టీకి కిక్‌బ్యాక్‌లను చెల్లించిందని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. 


Similar News