60 ఏనుగుల ప్రాణాలను కాపాడిన లోకోపైలట్

లోకోపైలట్ సమయ అప్రమత్తతో చీకట్లో రైల్వే ట్రాక్ దాటుతున్న 60ఏనుగుల బృందం రక్షించబడిన ఘటన వైరల్ గా మారింది.

Update: 2024-10-19 07:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : లోకోపైలట్ సమయ అప్రమత్తతో చీకట్లో రైల్వే ట్రాక్ దాటుతున్న 60ఏనుగుల బృందం రక్షించబడిన ఘటన వైరల్ గా మారింది. అస్సాంలోని హబీపూర్ -లమ్సాఖంగ్ మధ్య అర్ధరాత్రి ఏనుగుల గుంపు ట్రాక్ దాటుతుండగా ఏఐ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా లోకో పైలట్ కు అలర్ట్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వేశారు. రైలు నిలిపిన అనంతరం అలర్ట్ సిగ్నల్ ఎందుకు వచ్చిందని రైలు లైట్ల వెలుతురులో పరిశీలించగా.. పట్టాలు దాటుతున్న ఏనుగు గుంపును గమనించారు. తర్వాత ప్రయాణికులతో కలిసి ఆ ఏనుగులను తరిమారు. ఏనుగు గుంపు సురక్షితంగా పట్టాలు దాటకా తిరిగి రైలు ముందుకు వెళ్ళిపోయింది. ఈ వీడియోను ఐఏఎస్ సుప్రియా సాహు ఎక్స్ లో షేర్ చేశారు. ప్రమాదాల నివారణలో టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించారు.

మరోవైపు ఇదే రోజున శ్రీలంకలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలోనే ఆధునిక సాంకేతికత కొరవడిన నేపధ్యంలో లక్షల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ఓ రైలు భారీ ప్రమాదానికి గురైంది. కొలంబో నుంచి బట్టికలోవాకు వెళ్తున్న రైలు మిన్నేరియా రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే అప్పటికే పట్టాలపై ఉన్న ఏనుగుల గుంపును చూసిన లోకోపైలట్‌ సడన్‌ బ్రేకులు వేశారు. దాంతో రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో పెట్రోల్‌ పూర్తిగా లీకై నేలపాలైంది. మిగతా బోగీల నుంచి ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, మిగతా వాటికి గాయాలైనట్టుగా తెలిసింది. ఈ ఘటన శ్రీలంకలోని ఉత్తర మధ్య ప్రావిన్స్‌లో జరిగింది. ఈ రెండు ఘటనలు రైలు ప్రమాదాల నివారణలో ఆధునిక సాంకేతికత ఆవశ్యతను చాటుతున్నాయని రైల్వే ప్రయాణికులు విశ్లేషిస్తున్నారు.


Similar News