Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 85 శాతం బోనస్..!
భారతదేశం(India)లోని దిగ్గజ ఐటీ సర్వీసెస్(IT Services) సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys) తమ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని దిగ్గజ ఐటీ సర్వీసెస్(IT Services) సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys) తమ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులందరికీ యావరేజ్(Average)గా 85 శాతం మేర బోనస్(Bonus) చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల పని తీరు ఆధారంగా ఈ బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ నెల శాలరీ(November Salary)తో పాటే ఈ 85 శాతం బోనస్ అందిస్తామని సృష్టం చేసింది. బోనస్ జారీ గురించి ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్(Mails) ద్వారా సమాచారం కూడా అందజేశామని సంస్థ పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో(Q2FY25) ఇన్ఫోసిస్ రూ. 6506 కోట్ల నికర లాభాలను(Net profits) సాధించిన విషయం తెలిసిందే. క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఉద్యోగుల సహకారం కూడా ఉందని, దీంతో వారికి ఈ బోనస్ చెల్లించేందుకు నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్ వర్గాలు తెలిపాయి. అయితే ఏ కేటగిరీకి ఎంత బోనస్ చెల్లిస్తున్నదీ మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.